భూకబ్జా ఆరోపణలో అంబటి..ప్రాణహాని ఉందని మీడియా ముందుకు

by Disha Web Desk 5 |
భూకబ్జా ఆరోపణలో అంబటి..ప్రాణహాని ఉందని మీడియా ముందుకు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో మంత్రి అంబటి రాంబాబు కి కొత్త చిక్కులు ఎదురౌతున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేఖత ఉందని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో మంత్రి మరో వివాదంలో చిక్కుకున్నారు. సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబుపై భూకబ్జా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కోర్టు కేసులో ఉన్న తమ భూమిని మంత్రి కొనుగోలు చేసి, అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. సత్తెనపల్లి, రాజుపాలెం మండలం రెడ్డిగూడెం గ్రామంలోని తమ వారసత్వ భూమిని కొందరు కబ్జా చేశారని, దానిపై కోర్టులో వివాదం నడుస్తుండగానే మంత్రి అంబటి రాంబాబు కొనుగోలు చేశాడని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన విజయప్రసాద్ అనే వ్యక్తి చెబుతున్నారు. దీనిపై సత్తెనపల్లిలో విజయప్రసాద్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆధారాలతో సహా బయటపెట్టాడు.

విజయప్రసాద్ మాట్లాడుతూ.. రెడ్డిగూడెంలో సర్వే నం.298/2 లో తమ నాయనమ్మ సరోజనమ్మకు రెండు ఎకరాల భూమి ఉందని, దానిని 2013లో స్థానికులు కొందరు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించగా తాము కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ప్రస్తుతం అది కోర్టులో ఉండగానే 2020లో అంబటి రాంబాబు మంత్రి అయ్యాక, ఆ భూమిని ఏడుగురి పేర మార్చి.. కొనుగోలు చేసినట్లు తప్పుడు పత్రాలు తీసుకున్నారని తెలియజేశారు. దీంతో వారి పేరు కూడా కోర్టులో జత చేశామని, అప్పటి నుంచి వైసీపీ నాయకుల నుంచి బెదిరింపులు వస్తు్న్నాయని, మాకు, మా కుటుంబానికి అంబటి రాంబాబుతో ప్రాణహాని ఉందని, దయచేసి మాకు న్యాయం జరిగేలా చూడాలని మీడియా ముఖంగా కోరారు.

Next Story

Most Viewed