అమరావతి ఓ ఆర్థిక అగాధం.. భవిష్యత్‌లోనూ గుదిబండే : వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

by Disha Web Desk 21 |
అమరావతి ఓ ఆర్థిక అగాధం.. భవిష్యత్‌లోనూ గుదిబండే : వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో : అమరావతి ఓ పెద్ద ఆర్థిక అగాధమని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. ఇప్పడే కాదు భవిష్యత్‌లోనూ గుదిబండే అవుతుందని‘కాగ్’నివేదిక ద్వారా బహిర్గతమైనట్లు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా మంగళవారం పలు అంశాలపై ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన శైలిలో స్పందించారు. అమరావతిపై చంద్రబాబు మాస్టర్ ప్లాన్‌ను కాగ్ తన నివేదికలో ఎండగట్టిందని చెప్పుకొచ్చారు. రాజధానిపై నిపుణుల కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకోలేదని... ప్రభుత్వ భూములు వదిలేసి ప్రైవేటు భూములు సేకరించారని కాగ్ తెలిపిందని అన్నారు. రూ.46,400 కోట్ల డీపీఆర్‌లు లోప భూయిష్టంగా ఉన్నాయని...కేంద్రం వివరణ కోరినా స్పందించలేదని గత చంద్రబాబు ప్రభుత్వ చర్యలను కాగ్ ఎండగట్టిందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. మరోవైపు పోలవరంలో మరో కీలక ఘట్టం పూర్తయ్యిందని, జలాశయాన్ని ఎడమ కాలువతో అనుసంధానం చేసే సొరంగం పూర్తయినట్లు విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. 919 మీటర్ల పొడవు, 18 మీటర్ల వ్యాసార్థం, 20 వేల క్యూసెక్కుల సామర్ధ్యంతో తవ్వకం పూర్తయ్యిందని విజయసాయిరెడ్డి వెల్లడించారు.

Next Story