ఫార్మా కోర్సులకు బైపీసీ విభాగం నుండి సీట్ల కేటాయింపు: ఏపీఈఏపీ సెట్ కన్వీనర్ చదలవాడ నాగరాణి

by Seetharam |
ఫార్మా కోర్సులకు బైపీసీ విభాగం నుండి సీట్ల కేటాయింపు: ఏపీఈఏపీ సెట్ కన్వీనర్ చదలవాడ నాగరాణి
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఫార్మసీ కోర్సుల కోసం ఇంటర్మీడియట్ బైపీసీ విభాగం నుండి నిర్దేశించిన సీట్ల కేటాయింపును శుక్రవారం పూర్తి చేసినట్లు ఏపీఈఏపీ సెట్-2023 ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. బి ఫార్మాసీ, ఫార్మా డి, ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించి 192 ప్రభుత్వ, ప్రవేటు కళాశాలల్లో 10,423 సీట్లు అందుబాటులో ఉండగా, 141 సీట్లు మినహా 10,282 సీట్లు భర్తీ చేసామన్నారు. బైపీసీ స్ట్రీమ్‌కు ఫార్మా కోర్సుల కోసం నమోదైన వారి సంఖ్య 15,456గా ఉందన్నారు. వీరిలో 15,395 మంది అర్హత సాధించగా..14,832 మందికి తుది ఎంపికలో సీట్లు కేటాయించామని కన్వీనర్ చదలవాడ నాగరాణి వివరించారు. రాష్ట్ర క్రీడాభివృద్ది సంస్ధ నుండి తుది మెరిట్ జాబితా రావలసి ఉన్నందున 47 క్రీడల కోటా సీట్లను భర్తీ చేయలేదన్నారు. తుది గడువులోగా వీటిలో కూడా విద్యార్ధులను కేటాయిస్తామని చెప్పుకొచ్చారు. ఫార్మా ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించి ఒక విశ్వవిద్యాలయ, మూడు ప్రవేటు కళాశాలల నుండి 150 సీట్లు ఉండగా అన్ని భర్తీ చేసినట్లు వెల్లడించారు. బీఫార్మసీలో 8విశ్వవిద్యాలయ కళాశాలల్లో 478 సీట్లు ఉండగా అన్ని భర్తీ అయినట్లు వెల్లడించారు. 115 ప్రవేటు కళాశాలల్లో 8,288 సీట్లు ఉండగా 8,147 సీట్లకు కేటాయింపులు పూర్తి చేసామని నాగరాణి పేర్కోన్నారు. ఫార్మాడి కోర్సులలో 2 విశ్వ విద్యాలయ కళాశాలల్లో 59 సీట్లు, 63 ప్రవేటు కళాశాలల్లో 1448 సీట్లు ఉండగా అన్ని భర్తీ అయినట్లు చెప్పుకొచ్చారు. ప్రవేశాలు దక్కించుకున్న విద్యార్ధులు అయా కళాశాలల్లో 21వ తేదీ లోపు వ్యక్తిగతంగా రిపోర్టు చేయవలసి ఉంటుదని ఏపీఈఏపీ సెట్-2023 ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Next Story

Most Viewed