AP Elections 2024: దళితుల మధ్య అంతరాలను పెంచేలా సీట్ల కేటాయింపు.. ఎందుకు ఈ వివక్షత..?

by Disha Web Desk 3 |
AP Elections 2024: దళితుల మధ్య అంతరాలను పెంచేలా సీట్ల కేటాయింపు.. ఎందుకు ఈ వివక్షత..?
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. ముఖ్యంగా YSRCP అధినేత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వాయిదాల వారీగా అభ్యర్థులను మారుస్తున్నారు. ఇప్పటికే చాలామంది సిట్టింగ్ ఎంపీలను తొలింగించి రాబోయే ఎన్నికల్లో వేరే అభ్యర్థులకు టిక్కెట్లు కూడా షూరూ చేశారు. ఈ నేపథ్యంలో పలువురు నేతలు జగన్ తీరుపై దళిత సంఘాలు కూడా భగ్గుమంటున్నాయి. ఓ వర్గానికే మద్దతిస్తున్నారని మరో వర్గం నేతలు మండిపడుతున్నారు. సామాజికవర్గాల జాబితాలోకి వచ్చే మాల, మాదిగ రెండింటిని సమానంగా చూడాల్సింది పోయి వైసీపీ ప్రభుత్వం ఒక వర్గాన్ని మాత్రమే ప్రోత్సహించడం సబబుకాదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

రాయలసీమలో ఉన్న 9 ఎస్సీ స్థానాల్లో 7 స్థానాలను మాల వర్గానికే ఇచ్చారని.. కేవలం 2 స్థానాలను మాదిగలకు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన రెండు సీట్లలో ఇప్పటికే ఒకటి రద్దు చేయగా..రెండోది అనుమానమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళితుల మధ్య అంతరాన్ని పెంచేలా సీట్ల పంపకం ఎలా చేస్తారని..? ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 29ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో 28 చోట్ల వైసీపీ గెలిచింది. అయితే గెలిచిన 28 స్థానాల్లో 20మంది ఎమ్మెల్యేలు మాల వర్గానికి చెందిన వారేనని.. కేవలం 8 మందే మాదిగలు ఉన్నారని ఎందుకు ఈ వివక్షతని ప్రశ్నించారు.

నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ.. ఎస్సీలకు తానొచ్చాకే న్యాయం జరిగిందన్నట్లు మాటలు చెప్పే జగన్.. చేతల్లో మాత్రం దళితుల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరిస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. జగన్ కి ఈ పక్షపాతం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. గురువారం నిర్వహించిన సదస్సుకు రాష్ట్రప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అయితే ప్రతినిధులు 3గంటలు ఎదురు చూసిన ఆయన సదస్సుకు గైర్హాజరయ్యారు. దీనితో ఇటీవల తాడేపల్లిలో మాల ప్రతినిధులు లీడ్ చేసిన సదస్సుకు సజ్జల హాజరైయ్యారని.. తాము నిర్వహించిన సద్ధస్సుకు రాలేదని మాదిగ ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed