ఇంటర్ విద్యార్థులకు అలర్ట్: వార్షిక పరీక్షల ఫీజు గడువు పెంపు

by Disha Web Desk 21 |
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్: వార్షిక పరీక్షల ఫీజు గడువు పెంపు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటర్ విద్యార్థుల వార్షిక పరీక్షల ఫీజు గడువును ప్రభుత్వం పొడిగించింది. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ చదివే విద్యార్థులు డిసెంబరు 5 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ వెల్లడించారు.వాస్తవానికి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు నవంబరు 30తో ముగిసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ మరో 5 రోజులు గడువు పెంచుతూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇకపోతే డిసెంబరు 5 వరకు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండానే ఎగ్జామ్ ఫీజులు చెల్లించవచ్చని సౌరభ్ గౌర్ వెల్లడించారు. ఇది రెగ్యులర్, ప్రైవేటు ఇంటర్ జనరల్, ఒకేషనల్ గ్రూపుల విద్యార్థులందరికీ వర్తిస్తుందని ఇంటర్ బోర్డు తెలిపింది. మరోవైపు రూ.1000 ఆలస్య రుసుంతో డిసెంబరు 15 వరకు పరీక్ష ఫీజు చెల్లించే వెసులుబాటు ఉందని ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ పేర్కొన్నారు.

Next Story

Most Viewed