ఉపాధి హామీ కూలీల సమస్యలపై ఈనెల 29న కలెక్టరేట్ వద్ద ధర్నా.. ఐద్వా పిలుపు

by Javid Pasha |
ఉపాధి హామీ కూలీల సమస్యలపై ఈనెల 29న కలెక్టరేట్ వద్ద ధర్నా.. ఐద్వా పిలుపు
X

దిశ, ఉత్తరాంధ్ర: ఉపాధి హామీ కూలీల సమస్యలపై ఈనెల 29వ తేదీన జరిగే కలెక్టరేట్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయండి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీల సమస్యలు పరిష్కారం చేయాలని సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం ఐద్వా ఆధ్వర్యంలో అనకాపల్లి కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా కార్యక్రమాన్ని జయ ప్రదం చేయాలని పరవాడ మండలం ఉపాధి కూలీలకు పిలుపునివ్వడం జరిగింది ఈ సందర్భంగా పెద ముసిడవాడ గ్రామంలో జరిగిన ఉపాధి హామీ కూలీల ధర్నా నిర్వ హించి సమస్యలపై నినాదాలు చేయడం జరిగింది ప్రభుత్వాన్నే స్పందించి సమస్యలు పరిష్క రించాలని డిమాండ్ చేశారు.

సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ.. ఉపాధి కూలీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కనీస కూలి రోజుకు కొలతలతో సంబంధం లేకుండా ప్రభుత్వం ప్రకటించిన 272 రూపాయలు ప్రతికూలికి ఇవ్వాలని కనీసం 200 రోజులు కూలి పనులు కల్పించి గతంలో ఉన్న సదు పాయాలు సమ్మర్ అలవేన్సు, పనిముట్లుకు డబ్బులు,మంచినీరు, టెంట్, మెడికల్ కిట్లు వంటి సౌకర్యాలు కల్పించాలని,ఉపాధి పథకానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో నిధులు కేటాయించి పేదల కు పనులు కల్పించాలన్నారు పెద్ద ముసిడివాడలో తేనె తీగ దాడిలో గాయపడ్డ వారిని ఆదుకోవడానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు మంచినీరు నీడ మెడికల్ కిట్లు అందుబాటులో పెట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story

Most Viewed