బీజేపీలో చేరిన ప్రముఖ పారిశ్రామిక వేత్త.. ఆమె నాయకత్వంలో నడుస్తా!

by Disha Web Desk 5 |
బీజేపీలో చేరిన ప్రముఖ పారిశ్రామిక వేత్త.. ఆమె నాయకత్వంలో నడుస్తా!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బీజేపీ పొత్తులపై సమాలోచనలు చేస్తూ.. వడివడిగా అడుగులు వేస్తొంది. ఎన్నికల్లో కొన్ని సీట్లైనా గెలిచి తమ ఉనికి చాటుకునేలా బీజేపీ ప్రయత్నాలు చేస్తొంది. ఈ నేపధ్యంలోనే ప్రముఖ పారిశ్రామిక వేత్త రెడ్డప్ప కాశాయ కండువా కప్పుకున్నారు. విజయవాడలో జరుగుతున్న బీజేపీ సమావేశంలో పార్టీ చీఫ్ పురంధేశ్వరి ఆద్వర్యంలో రెడ్డప్ప బీజేపీలో చేరారు.

రెడ్డప్ప మాట్లాడుతూ ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ది పథాన నడుస్తోదంని, భవిష్యత్ తరాలకు మార్గదర్శిగా ఉంటూ, దేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా ఆయన పని చేస్తున్నారని కొనియాడారు. అలాగే పురందేశ్వరి నాయకత్వంలో రాష్ట్రంలో బీజేపీ ముందుకు వెళుతుందని భావించి పార్టీలో చేరినట్లు తెలిపారు. మోడీ విధానాలకు ఆకర్షితులై ఎంతో మంది బీజేపీలో చేరుతున్నట్లు పురందేశ్వరి అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ చీఫ్ పురందేశ్వరితో పాటు, మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఎంపీ సీఎం రమేష్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సహా బీజేపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. అలాగే మోడీ విధానాలకు ఆకర్షితులై ఎంతో మంది బీజేపీలో చేరుతున్నట్లు పురందేశ్వరి అన్నారు.


Next Story

Most Viewed