మా నాన్నకు బుద్ధి చెప్పండి.. అమ్మను కొడుతుంటే తట్టుకోలేకపోతున్నా

by GSrikanth |
మా నాన్నకు బుద్ధి చెప్పండి.. అమ్మను కొడుతుంటే తట్టుకోలేకపోతున్నా
X

దిశ, డైనమిక్ బ్యూరో: పోలీస్ స్టేషన్ అంటేనే చాలా మందికి భయం. ఏ గొడవ అయినా సరే పోలీస్ స్టేషన్ వరకు వెళ్లొద్దని రాజీలు సైతం చేస్తారు. ఇక పోలీసులు కనిపించారంటే చాలు ఎంతటివారైనా భయపడతారు. అలాంటిది తొమ్మిదేళ్ల ఓ బుడ్డోడు ఏకంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. నేరుగా ఎస్ఐ దగ్గరకు వెళ్లి కూర్చీలో కూర్చుని కంప్లైంట్ చేశాడు. తన తల్లిని తండ్రి మద్యం తాగి వచ్చి కొడుతున్నాడని కాస్త బుద్ధి చెప్పాలంటూ ప్రాధేయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపట్ల జిల్లాలోని కర్లపాలెం మండలంలోని పాత ఇస్లాంపేటకు చెందిన సుభానీ, సుభాంబీ దంపతులు ఉన్నారు. ఈ దంపతులకు తొమ్మిదేళ్ల కుమారుడు రహీమ్ ఉన్నారు. సుభానీ రైసు మిల్లులో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అలాగే కుట్టుపని కూడా చేస్తుంటాడు.

అయితే గత కొంతకాలంగా సుభానీ మద్యానికి బానిసగా మారాడు. ప్రతీ రోజూ తాగి ఇంటికి వచ్చి, రాత్రి సమయంలో తన భార్యను కొడుతుండేవాడు. శారీరకంగా హింసకు చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. నిత్యం తన తండ్రి తల్లిని చిత్రహింసలకు గురి చేయడాన్ని తొమ్మిదేళ్ల కుమారుడు రహీమ్ గమనించాడు. తండ్రి చేష్టలతో ఆ పసి మనసు గాయపడింది. తండ్రిపై కోపంతో రగిలిపోయాడు. తండ్రి చేతిలో దెబ్బలు తిని నిత్యం ఏడుస్తూనే ఉన్న తల్లికి ఆ బాధ నుంచి ఉపశమనం కల్పించాలని నిర్ణయించుకున్ననాడు. అంతే కర్లపాలెం మండలం ఇస్లాంపేట పోలీస్ స్టేషన్‌కు నేరుగా వెళ్లాడు. బాలుడిని చూసిన ఎస్ఐ శివయ్య ఎందుకు వచ్చావు. ఏంటి అని ప్రశ్నించారు.

కుర్చీలో కూర్చోబెట్టి మంచినీళ్లు ఇచ్చిన అనంతరం ఎందుకు వచ్చావు అని అడిగారు. అయితే తన తండ్రిపై ఫిర్యాదు చేయడానికి వచ్చానని ఎలాంటి భయం లేకుండా ఎస్ఐతో చెప్పాడు. తన తండ్రి సుభానీ రోజూ తాగి వచ్చి అమ్మను కొడుతున్నాడని తెలిపాడు. కొట్టవద్దని ఎన్నిసార్లు తన తల్లి, తాను తండ్రిని వేడుకున్నా వినడం లేదని వాపోయాడు. తండ్రికి బుద్ధి చెప్పాలని వేడుకున్నాడు. బాలుడి నుంచి వివరాలు సేకరించిన ఎస్ఐ శివయ్య బాలుడి తల్లిదండ్రులను పోలీసు స్టేషన్‌కు పిలిపించారు. ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. భార్యపై చేయి చేసుకోకూడదని సుభానీకి ఎస్ఐ సూచించారు.మళ్లీ ఇలాంటివి జరిగితే చట్ట ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అనంతరం ఇంటికి పంపించి వేశారు.

Also Read...

తాలిబన్ల పాలన కంటే వైసీపీ పాలన దారుణం.. నారా లోకేశ్ ఫైర్Next Story

Most Viewed