బైక్‌ను ఢీకొట్టిన లారీ.. ఇద్దరు దుర్మరణం

by Disha Web Desk 21 |
బైక్‌ను ఢీకొట్టిన లారీ.. ఇద్దరు దుర్మరణం
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ఆర్ కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కమలాపురం మండలం పందిళ్లపల్లె పెట్రోల్ బంకు వద్ద బైక్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు నాగులూరి మహేశ్(31) బింగి చిన్న యోసూన్(29)లుగా గుర్తించారు. వీరిది ప్రకాశం జిల్లాగా గుర్తించారు. పెట్రోల్ బంకులోకి బైక్ పై వెళుతున్న వారిని వేగంగా వచ్చి లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులకు స్థానికులు తెలియజేశారు. మృతులు పందిళ్లపల్లెలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను కడప రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story

Most Viewed