పీసీబీ ఫైల్స్ దగ్ధం కేసులో కీలక పరిణామం... అధికారుల పాత్రపై విచారణ

by srinivas |
పీసీబీ ఫైల్స్ దగ్ధం కేసులో కీలక పరిణామం... అధికారుల పాత్రపై విచారణ
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ పెనమలూరు వద్ద పీసీబీ ఫైల్స్‌ హార్డ్ డిస్కులను దగ్ధం చేసిన విషయం తెలిసిందే. అయితే కేసులో పోలీసులు విచారణను మరింత ముమ్మరం చేశారు. విజయవాడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయాన్ని పరిశీలించారు. ఏడు సెక్షన్ల అధికారుల పాత్ర ఉందని అనుమానిస్తున్నారు. దీంతో వారిని ప్రశ్నిస్తున్నారు. స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తున్నారు. కార్యాలయంలో ఉండాల్సిన హార్డ్ డిస్కులు, ఫైల్స్ ఎందుకు బయటకు వెళ్లాయని ఆరా తీస్తున్నారు. ఫైల్స్ పడవేయమని ఎవరు చెప్పారని ప్రశ్నిస్తున్నారు. దహనం చేసిన ఫైల్స్‌లో కీలకమైనవి ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు.

Next Story