Breaking: ఎండల తీవ్రతతో ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం

by Disha Web Desk 16 |
Breaking: ఎండల తీవ్రతతో ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే ఎండలు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. మరోవైపు వడగాల్పులు కూడా ఎక్కువయ్యాయి. మధ్యాహ్నం అయ్యే సరికి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రభుత, ప్రైవేటు బడుల్లో ఒంటిపూటే తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉదయం నుంచి 11.30 గంటలకు తరగతులు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఉదయం 8.30 నుంచి 9 వరకు రాగిజావ పంపిణీ చేయనున్నారు. ఎండలు తగ్గే వరకూ ఒంటి పూట తరగతులే నిర్వహించనున్నారు. విద్యార్థులు స్కూలు నుంచి వెళ్లిన తర్వాత బయట తిరగొద్దని విద్యార్థులకు విద్యాశాఖ అధికారులు సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని తెలిపారు. ఎక్కువగా నీళ్లు, ప్రూట్ జ్యూస్ లాంటివి తీసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.

Next Story