ఏపీకి భారీ పెట్టుబడులు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

by srinivas |
ఏపీకి భారీ పెట్టుబడులు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీకి భారీ పెట్టుబడులు రాబోతున్నాయి. ఈ మేరకు పలు కంపెనీలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. రాష్ట్రంలో పెట్రోల్ రిఫైరీ ఏర్పాటుకు అడుగులు వేస్తోంది. ఈ మేరకు బీపీసీఎల్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చలు జరుపుతున్నారు. పెట్రోల్ రిఫైనరీ ఏర్పాటు చేసేందుకు 5 వేల ఎకరాల భూమి అవసరమని చంద్రబాబుకు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇందుకు చంద్రబాబు మూడు నెలల సమయం ఇచ్చారు. ఫీజిబిలిటీ రిపోర్టు ఇవ్వాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

అనంతరం విన్ ఫాస్ట్ ప్రతినిధులతోనూ చంద్రబాబు సమావేశం అయ్యారు. విన్ ఫాస్ట్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో వియత్నాంలో పెరున్న సంస్థ. ఈ సంస్థ సీఈవో పామ్ సాన్ చౌతో పాటు సంస్థ ప్రతినిథులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం ఆ సంస్థ ప్రతినిధులకు వివరించారు. ఈవీ, బ్యాటరీ తయారీ ప్లాంట్‌ను ఏపీలో నెలకొల్పాలని చంద్రబాబు వారిని కోరారు. ప్లాంట్‌కు అవసరమైన భూమి, ఇతర మౌళిక సదుపాయాల కల్పనకు తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహకరిస్తామని...పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా కోరారు. అంతకుముందు బిపీసీఎల్, విన్ ఫాస్ట్ సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి విందు ఇచ్చారు.

Next Story