హైకోర్టులో పిన్నెల్లి బెయిల్ పిటిషన్‌.. తీర్పు వాయిదా

by srinivas |
హైకోర్టులో పిన్నెల్లి బెయిల్  పిటిషన్‌..  తీర్పు వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. మాచర్ల సీఐపై దాడి, పోలింగ్ కేంద్రంలో టీడీపీ ఏజెంట్‌పై దాడి కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఇరువర్గాల వాదనల విన్న కోర్టు తీర్పును ఈ నెల 18కి వాయిదా వేసింది.

కాగా ఈ కేసుల్లో నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో మాచర్ల నియోజకవర్గంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పలుచోట్ల వైసీపీ, టీడీపీ శ్రేణులు దాడులకు దిగాయి. మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అక్కడున్న సిబ్బందితో వాగ్వాదానికి దిగడంతో పాటు ఈవీఎం మిషన్‌ను ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్‌పై దాడి చేశారు. ఈ రెండు కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ జైలుకు తరలించారు. దీంతో పిన్నెల్లికి బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన తరపున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed