Big Breaking: ప్రకాశం జిల్లాలో దారుణం.. చూస్తుండగానే కుప్పకూలిన భవనం

by Indraja |   ( Updated:2024-02-04 04:57:21.0  )
Big Breaking: ప్రకాశం జిల్లాలో దారుణం.. చూస్తుండగానే కుప్పకూలిన భవనం
X

దిశ డైనమిక్ బ్యూరో: ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. అందుకే ఊహలకు అందనివె వాస్తవాలు అంటారు. ఇందులో కొన్ని సహజసిద్దంగా జరిగేవి అయితే మరికొన్ని మానవ తప్పిదాలవల్ల జరిగేవి ఉంటాయి. ఇలా మానవ తప్పిదంవల్ల ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర దుర్ఘటన చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే క్షణాల్లో మూడు అంతస్థుల భవనం నేలకొరిగింది. విరాల్లోకి వెళ్తే.. మూడు అంతస్థుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో ఒక్క సరిగా ఆంధ్రప్రదేశ్ ఉల్లికి పడింది.

ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో పెద్ద డోర్నాలలో చోటు చేసుకుంది. శ్రీశైలం రోడ్డులో వాసవి లాడ్జి పేరుతో మూడు అంతస్థుల భవనం ఉంది. ఎప్పుడు కస్టమర్స్ తో రద్దీగా ఉండే ఈ లాడ్జి పక్కన మరో భవన నిర్మాణానికి ప్రణాలికలు రూపొందాయి. ఈ నేపథ్యంలో మరో భవనాన్ని నిర్మించేందుకు పునాది గుంతలు తీశారు. దీనితో వాసవి లాడ్జి భవనంలో పగుళ్లు ఏర్పడి భవనం ఓ వైపుకి ఒరిగింది.

ఈ క్రమంలో అందరూ చూస్తుండాగానే ఒక్కసారిగా మూడు అంతస్థుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా అదిరిపడింది. అయితే భవనంలో పగుళ్లు రావడం గమనించిన లాడ్జి సిబ్బంది హుటాహుటీన భవనం లోని వారందరిని బయటకు పంపించి లాడ్జిని ఖాళీ చేయించారు. దీనితో పెనుప్రమాదం తృటిలో తప్పింది. కాగా ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.

కాగా ఈ ఘటనను ప్రత్యేక్షంగా చూసిన వాళ్ళు ఫోటోలు , వీడియోలు తీసి సోషలో మీడియా లో పోస్ట్ చేశారు. దీనితో ఈ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

Next Story

Most Viewed