రంగమ్మతో నవరాత్రి ‘లేడీస్ స్పెషల్’

38

దిశ, వెబ్‌డెస్క్: అనసూయ ఓ వైపు టెలివిజన్ కార్యక్రమాలు చేస్తూనే.. మరోవైపు సినిమాల్లోనూ నటిస్తూ కెరీర్‌ను అందంగా డిజైన్ చేసుకుంటోంది. ఇక కరోనా టైమ్‌లో ఖాళీగా ఉండకుండా తన యూట్యూబ్ చానల్‌ను ఎంగేజ్ చేయడానికి రకరకాల వీడియోలను అప్‌లోడ్ చేసిన రంగమ్మత్త.. కొద్ది కాలం నుంచి కాన్సెప్టులతో కూడిన కార్యక్రమాలతో వీడియోలు రూపొందిస్తుండటం విశేషం. ప్రస్తుతం దుర్గాదేవీ శరన్నవరాత్రుల సందర్భాన్ని పురస్కరించుకుని.. ప్రత్యేకంగా మహిళల మేకప్, డ్రెస్సింగ్‌ విషయంలో సలహాలిస్తోంది.

ప్రస్తుతం బతుకమ్మ సంబరాలతో పాటు దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ టైమ్‌లో మహిళలు అలంకరణ, వస్త్రాల మీదే ఎక్కువ శ్రద్ధ పెడతారు. అందుకే అనసూయ.. తన యూట్యూబ్ చానెల్‌లో ‘నవస్త్ర’ అనే ప్రోగ్రామ్‌ ద్వారా మేకప్ టిప్స్‌తో పాటు నవరాత్రుల సందర్భంగా ఎలా రెడీ కావాలో స్పెషల్ గెస్ట్‌లతో వివరిస్తోంది. ‘అమ్మాయిలు తమ లైఫ్‌లో ప్రధానంగా అలంకరణ మీదే దృష్టి పెడతారు. అయితే, ఈ నవరాత్రి సందర్భంగా.. అందరూ ఇంటి దగ్గరే ఉండి, నేను అందించే నవరాత్రి లుక్స్‌ను ఫాలో కావచ్చు. అందుకే ఈ ప్రోగ్రామ్‌ను డిజైన్ చేశాను. ‘నవస్ర్త – స్టే ఎట్ హోమ్.. స్లే ఎట్ హోమ్’ అని అనసూయ అంటోంది. ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ అయిపోగా.. అనసూయ పర్సనల్ స్టైలిస్ట్ గౌరి నాయుడు ఈ లుక్స్, మేకప్ టిప్స్ అందిస్తుండటం విశేషం.