ఆ స్టార్ హీరోతో రొమాన్స్ చేయనున్న యాంకర్ అనసూయ..

511

దిశ, సినిమా : బుల్లి తెర అందాల హాట్ యాంకర్ అనసూయ.. ఎప్పటికప్పుడూ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది. తన మాటలతోనే కాకుండా అందచందాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తున్న బ్యూటీ.. తాజాగా మరో స్పెషల్ సాంగులో నటించనున్నట్టు తెలుస్తోంది. ఓ వైపు యాంకరింగ్‌తో బిజీగా ఉంటూనే వరుస సినిమాలతో అదరగొడుతున్న అనసూయ పెద్ద హీరోల సినిమాల్లో విభిన్న పాత్రల్లో కనిపిస్తూ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది.

ఈ మేరకు మాస్ మహరాజా హీరో రవితేజ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న ‘ RT 68’ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ ఉందనీ, దానికోసం అనసూయనే సెలక్ట్ చేసినట్లు సమాచారం. ఇందుకు అనసూయ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఆమె సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’లో రంగమ్మత్త పాత్రలో ఒదిగిపోయి అందరిని ఆకట్టుకోగా.. ప్రస్తుతం ‘పుష్ప’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..