మోస్ట్ హంబుల్ ఎక్స్‌పీరియన్స్ పంచుకున్న ‘లైగర్’ భామ

by  |
ananya-pade
X

దిశ, సినిమా : బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్యా పాండే (Ananya Panday) మాల్దీవ్స్ ట్రిప్ కంప్లీట్ అయినా సరే తన మనసు మాత్రం అక్కడే ఉన్నట్లు చెబుతోంది. ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ అండ్ క్యూట్ వీడియో షేర్ చేసింది. సముద్రంలో తాబేలుతో కలిసి ఈతకొడుతున్న క్లిపింగ్ షేర్ చేసిన అనన్య.. ఇది తన లైఫ్‌లో మోస్ట్ హంబుల్ ఎక్స్‌పీరియన్స్ అని తెలిపింది. మన ప్లానెట్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందని, ఇలాంటి యూనిక్ క్రియేచర్స్‌కు ఆశ్రయమిస్తుందని చెప్పింది. ఇలాంటి భూమిని మనం తప్పకుండా కాపాడుకోవాలని, ఇప్పటికే లేట్ అయిందని సూచించింది. లాస్ట్ వీక్ మాల్దీవ్స్ నుంచి ముంబై చేరుకున్న అనన్య.. ప్రస్తుతం పూరీ – విజయ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘లైగర్’ షూటింగ్‌లో బిజీగా ఉంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ మూవీ ద్వారానే సౌత్‌లోకి ఎంటర్ కాబోతోంది భామ.

Next Story

Most Viewed