ముంబై సైబర్ క్రైమ్ స్క్వాడ్‌లో అనన్య పాండే

by  |
ముంబై సైబర్ క్రైమ్ స్క్వాడ్‌లో అనన్య పాండే
X

దిశ, సినిమా : సోషల్ మీడియా బుల్లీయింగ్‌పై అవగాహన కల్పించే లక్ష్యంతో యాక్ట్రెస్ అనన్య పాండే 2019లోనే ‘So+ పాజిటివ్’ పేరుతో ఒక ఇనిషియేటివ్ ప్రారంభించింది. తను కూడా చాలా యంగ్ ఏజ్ నుంచే ఆన్‌లైన్‌లో విద్వేషాలు ఎదుర్కొన్నానని, అందుకే ఈ ప్రోగ్రామ్ చేపట్టినట్టు ఓ ఇంటర్వ్యూలో ఇదివరకే చెప్పింది. అయితే ఈ విషయాలు అందరికీ తెలియాలన్న ఉద్దేశ్యంతో ఆన్‌లైన్ క్రైమ్, సైబర్ బుల్లీయింగ్ గురించి మరింతగా తెలుసుకునేందుకు ముంబై సైబర్ క్రైమ్ బ్రాంచ్‌‌తో టచ్‌లో ఉన్నట్టు ఆన్‌లైన్ ఇంటరాక్షన్‌లో వెల్లడించింది. ఈ క్రమంలో ఆన్‌లైన్ విద్వేషాలు, బెదిరింపుల నుంచి యువతను ఎలా నిరోధించాలో ఎక్స్‌పర్ట్స్‌ నుంచి తెలుసుకోవడంతో పాటు దీనికి వ్యతిరేకంగా గళం విప్పేందుకు యూత్‌‌కు హెల్ప్ చేయనున్నట్టు తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్రొఫైల్‌ను ఎలా సేఫ్‌గా ఉంచుకోవాలో సైబర్ క్రైమ్‌ అఫీషియల్స్‌ ద్వారా తెలుసుకున్నట్టు చెప్పిన అనన్య.. ఈ ఎక్స్‌పీరియన్స్ చాలా మంది ఆన్‌లైన్ యూజర్లకు ఉపయోగపడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

Next Story