తహసీల్దార్ ఆఫీస్‌లో వృద్ధురాలు మృతి

143
old woman died

దిశ, తుర్కపల్లి : తన పేరుపై ఉన్న వ్యవసాయ భూమిని కుమారులకు రిజిస్ట్రేషన్ చేయించడానికి వచ్చిన తల్లి తహసీల్దార్ కార్యాలయంలోనే కన్ను మూసింది. ఓ వైపు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా.. కుప్పకూలిన వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం..

తుర్కపల్లి మండలంలోని చిన్న లక్ష్మాపురం గ్రామానికి చెందిన నరికే యాదమ్మ (72)కు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తన పేరిట ఉన్న వ్యవసాయ భూమిని వారికి రిజిస్ట్రేషన్ చేయించడం కోసం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చింది. ఒకవైపు భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా మరోవైపు కార్యాలయంలో వేచి ఉన్న యాదమ్మ ఆరోగ్య పరిస్థితి అకస్మాత్తుగా విషమించి కార్యాలయ ఆవరణలోనే మృతి చెందింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..