చెవిటి, మూగవారితో ఈజీ కమ్యూనికేషన్‌కు ‘వేవ్‌చాట్’

by  |
Wavechat
X

దిశ, ఫీచర్స్ : షాదన్ ఉమెన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ(హైదరాబాద్)కి చెందిన ముగ్గురు విద్యార్థినులు.. చెవిటి, మూగవారికి ఈజీగా కమ్యూనికేట్ చేసేందుకు వీలుగా ‘వేవ్ చాట్’ అనే యాప్ తీసుకొచ్చారు. అది ఎలా పనిచేస్తుంది? దానివల్ల లాభమేంటి? తెలుసుకుందాం.

మనం మాట్లాడిన మాటల్ని రికార్డ్ చేస్తూ వాటిని వీడియో లేదా ఎమోటికాన్‌ల రూపంలో సంకేత సంజ్ఞలుగా ఉత్పత్తి చేస్తుంది. కేవలం సెకన్ల వ్యవధిలోనే ఈ ‘అనువాదం’ జరుగుతుంది. అంతేకాదు ఒకరు క్రమం తప్పకుండా ఉపయోగించే పదబంధాలు లేదా ప్రశ్నల టెంప్లేట్‌లను సేవ్ చేయవచ్చు. మొత్తం సంభాషణను కూడా యాప్‌లో సేవ్ చేసుకునే అవకాశముంది. మానసిక ఆరోగ్య చికిత్సకులు, మనస్తత్వవేత్తలు, సంకేత భాషా నిపుణులతో యాప్ గురించి సుదీర్ఘంగా చర్చించిన నిర్వాహకులు అందుకు తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేశారు. అంతేకాదు మాదాపూర్‌లోని ‘ఎకోస్ లివింగ్ కేఫ్‌’లో డెఫ్ అండ్ స్పీచ్ ఇంపెయిర్డ్ వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ ఎలా జరుగుతుందనే విషయాన్ని అర్థం చేసుకునేందుకు పలుమార్లు అక్కడికి వెళ్లి సునిశితంగా గమనించారు. అన్ని ఇన్‌పుట్స్ తీసుకుని వైకల్యమున్న వారికి నచ్చేలా దీన్ని అభివృద్ధి చేశారు.


Next Story

Most Viewed