ప్రియుడి ఇంటి ముందు వంటావార్పు

దిశ, మునుగోడు: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి దీక్ష శనివారంతో మూడో రోజుకు చేరింది. మునుగోడు మండల పరిధిలోని కల్వలపల్లి గ్రామంలో వంటేపాక పుష్పలత అదే గ్రామానికి చెందిన గంగుల వెంకన్న తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మొహం చాటేశాడని ఆరోపిస్తూ.. వెంకన్న ఇంటి ముందు మూడు రోజులుగా దీక్ష, వంటావార్పుచేస్తూ నిరసన తెలియజేస్తోంది. శనివారం నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి బాధితురాలిని కలిశారు. ప్రియుడిపై ఆమె ఫిర్యాదు చేసిందని, బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని డీఎస్పీ […]

Update: 2020-07-04 10:23 GMT

దిశ, మునుగోడు: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి దీక్ష శనివారంతో మూడో రోజుకు చేరింది. మునుగోడు మండల పరిధిలోని కల్వలపల్లి గ్రామంలో వంటేపాక పుష్పలత అదే గ్రామానికి చెందిన గంగుల వెంకన్న తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మొహం చాటేశాడని ఆరోపిస్తూ.. వెంకన్న ఇంటి ముందు మూడు రోజులుగా దీక్ష, వంటావార్పుచేస్తూ నిరసన తెలియజేస్తోంది. శనివారం నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి బాధితురాలిని కలిశారు. ప్రియుడిపై ఆమె ఫిర్యాదు చేసిందని, బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని డీఎస్పీ తెలిపారు.

Tags:    

Similar News