సిగరేట్ కోసం రచ్చ రచ్చ.. ముగ్గురిపై దాడి

దిశ, వెబ్‌డెస్క్: సిగరేట్ విషయంలో జరిగిన చిన్న వాగ్వాదం రచ్చ రచ్చ అయ్యింది. రెచ్చిపోయిన యువకులు ఆగమాగం చేశారు. ఇతరులు భయానికి గురయ్యేలా వ్యవహరించి బీభత్సం సృష్టించారు. హైదరాబాద్‌ నేరెట్‌మెట్‌లో జరిగిన ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. అమీన్ అనే యువకుడు అతని స్నేహితుడితో కలిసి ఓ పాన్ షాపు దగ్గరకి వెళ్లాడు. సిగరేట్ ఇవ్వాలని యజమానిని కోరడంతో ఇతరులకు పాన్ కట్టే సమయంలో ఆలస్యం అయ్యింది. దీంతో కోపానికి గురైన అమీన్, అతని స్నేహితుడు […]

Update: 2020-07-21 05:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: సిగరేట్ విషయంలో జరిగిన చిన్న వాగ్వాదం రచ్చ రచ్చ అయ్యింది. రెచ్చిపోయిన యువకులు ఆగమాగం చేశారు. ఇతరులు భయానికి గురయ్యేలా వ్యవహరించి బీభత్సం సృష్టించారు. హైదరాబాద్‌ నేరెట్‌మెట్‌లో జరిగిన ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. అమీన్ అనే యువకుడు అతని స్నేహితుడితో కలిసి ఓ పాన్ షాపు దగ్గరకి వెళ్లాడు. సిగరేట్ ఇవ్వాలని యజమానిని కోరడంతో ఇతరులకు పాన్ కట్టే సమయంలో ఆలస్యం అయ్యింది. దీంతో కోపానికి గురైన అమీన్, అతని స్నేహితుడు కలిసి యజమానిపై తీవ్రంగా దాడి చేశారు. అతనితో పాటు అడ్డొచ్చిన ఇద్దరు స్థానికులను చితకబాదారు. వారందరికీ తీవ్రగాయాలు అయ్యాయి. దాడి దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

Tags:    

Similar News