కరెంట్ షాక్‌తో యువకుడి మృతి

దిశ, మహబూబ్‎నగర్: విద్యుత్ ఆ ఇంటికి వెలుగునే కాదు అదే ఇంటి దీపాన్ని కూడా ఆర్పేసింది. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని చందపూర్‌లో గత రెండు రోజులుగా వీస్తున్న ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. దీంతో కరెంట్ తీగలు కిందకు వేలాడుతూ ఉండడంతో అదే గ్రామానికి చెందిన తాయప్ప అనే యువకుడు వాటిని సరిచేసేందుకు ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. కొడుకు కళ్ల ముందే చనిపోవడంతో ఆ కుటుంబంలో […]

Update: 2020-05-20 05:01 GMT

దిశ, మహబూబ్‎నగర్: విద్యుత్ ఆ ఇంటికి వెలుగునే కాదు అదే ఇంటి దీపాన్ని కూడా ఆర్పేసింది. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని చందపూర్‌లో గత రెండు రోజులుగా వీస్తున్న ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. దీంతో కరెంట్ తీగలు కిందకు వేలాడుతూ ఉండడంతో అదే గ్రామానికి చెందిన తాయప్ప అనే యువకుడు వాటిని సరిచేసేందుకు ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. కొడుకు కళ్ల ముందే చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Tags:    

Similar News