బ్రహెయిన్‌లో వికారాబాద్ జిల్లా యువకుడు మృతి

బహ్రెయిన్‌లో తెలంగాణవాసి మృతి చెందాడు. వికారాబాద్ జిల్లా బొంరస్ మండలం మెట్లకుంటకు చెందిన సందగాళ్ల దయాకర్(21) గురువారం రాత్రి గుండెపోటుతో మ‌ృతి చెందినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. దాయకర్ చిన్నతనంలోనే తండ్రి మృతి చెందాడు. దీంతో కుటుంబ భారం తల్లి అనంతమ్మ మీద పడింది. దీంతో తల్లికి చేదోడువాదోడుగా ఉండేందుకు దయాకర్ ఇటీవల ఉపాధి కోసం బ్రహెయిన్ వెళ్లాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి తీవ్ర గుండెపోటు రావడంతో మృతి చెందాడు. దీంతో తల్లి అనంతమ్మ […]

Update: 2020-04-24 23:08 GMT

బహ్రెయిన్‌లో తెలంగాణవాసి మృతి చెందాడు. వికారాబాద్ జిల్లా బొంరస్ మండలం మెట్లకుంటకు చెందిన సందగాళ్ల దయాకర్(21) గురువారం రాత్రి గుండెపోటుతో మ‌ృతి చెందినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. దాయకర్ చిన్నతనంలోనే తండ్రి మృతి చెందాడు. దీంతో కుటుంబ భారం తల్లి అనంతమ్మ మీద పడింది. దీంతో తల్లికి చేదోడువాదోడుగా ఉండేందుకు దయాకర్ ఇటీవల ఉపాధి కోసం బ్రహెయిన్ వెళ్లాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి తీవ్ర గుండెపోటు రావడంతో మృతి చెందాడు. దీంతో తల్లి అనంతమ్మ కన్నీరుమున్నీరు అవుతోంది. తమ కుమారుడి మృతదేహాన్ని రప్పించేందుకు ప్రభుత్వం స్పందించాలని కోరారు.

Tags: young man dead, heart attack, Bahrain, vikarabad distric

Tags:    

Similar News