చందానగర్‌లో యువకుడు ఆత్మహత్య

దిశ, క్రైమ్ బ్యూరో : పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల ఓ క్రిమినల్ కేసులో నిందితుడిగా ఉన్న ఆర్. జితేందర్ రెడ్డి (29) సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చందానగర్ పీఎస్ పరిధిలోని జవహర్ నగర్ కాలనీలో నివసించే జితేందర్ రెడ్డి భాను ప్రసాద్ తో కలిసి సివిల్ ఇంజినీర్ గా పనిచేశాడు. యాజమాని వద్ద రూ.6 లక్షల నగదు తీసుకుని మోసం చేసిన కేసులో నవంబరు 23న జితేందర్ రెడ్డిని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసి […]

Update: 2020-12-21 11:51 GMT

దిశ, క్రైమ్ బ్యూరో : పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల ఓ క్రిమినల్ కేసులో నిందితుడిగా ఉన్న ఆర్. జితేందర్ రెడ్డి (29) సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చందానగర్ పీఎస్ పరిధిలోని జవహర్ నగర్ కాలనీలో నివసించే జితేందర్ రెడ్డి భాను ప్రసాద్ తో కలిసి సివిల్ ఇంజినీర్ గా పనిచేశాడు. యాజమాని వద్ద రూ.6 లక్షల నగదు తీసుకుని మోసం చేసిన కేసులో నవంబరు 23న జితేందర్ రెడ్డిని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ చేశారు. ప్రస్తుతం కండిషన్ బెయిల్ పై విడుదలయిన యువకుడు సోమవారం సాయంత్రం 3.30 గంటల సమయంలో చందానగర్ లోని తన నివాసంలో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనపై మృతుని తండ్రి నాగిరెడ్డి చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Tags:    

Similar News