అక్కడ మతపరమైన నిర్మాణాలు తొలగించాల్సిందే!

దిశ, ఫీచర్స్ : రోడ్లు, వీధులతో పాటు ఇతరత్రా పబ్లిక్ ప్లేసెస్‌లో అనుమతి లేని నిర్మాణాలను తొలగించేందుకు యూపీ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. 2011 జనవరి 1 తర్వాత, పబ్లిక్ రోడ్స్‌పై కట్టిన నిర్మాణాలను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు హోమ్ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు తాజాగా సర్కారు ఈ చర్యలకు పూనుకున్నదని అధికార వర్గాలు తెలిపాయి. సర్కారు ఆదేశాలను అతిక్రమిస్తూ ఎవరైనా […]

Update: 2021-03-12 02:09 GMT

దిశ, ఫీచర్స్ : రోడ్లు, వీధులతో పాటు ఇతరత్రా పబ్లిక్ ప్లేసెస్‌లో అనుమతి లేని నిర్మాణాలను తొలగించేందుకు యూపీ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. 2011 జనవరి 1 తర్వాత, పబ్లిక్ రోడ్స్‌పై కట్టిన నిర్మాణాలను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు హోమ్ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు తాజాగా సర్కారు ఈ చర్యలకు పూనుకున్నదని అధికార వర్గాలు తెలిపాయి. సర్కారు ఆదేశాలను అతిక్రమిస్తూ ఎవరైనా నిర్మాణాలు చేపడితే ‘కంటెప్ట్ ఆఫ్ కోర్టు’ కింద వారిపై చర్యలు తీసుకోనున్నారు. 2011కు ముందే మతపరమైన నిర్మాణాలు పబ్లిక్ ప్లేసెస్‌లో ఉన్నట్టయితే సంబంధిత మేనేజ్‌మెంట్స్.. దాతల నుంచి భూమి తీసుకున్నట్లుగా తెలిపే ఆధారాలను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాగా ఇందుకోసం 6 నెలల గడువు కూడా ఇచ్చింది సర్కారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News