‘నిమ్మగడ్డకు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్’

దిశ, విశాఖపట్నం: రిటైర్మెంట్ తర్వాత నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంటుగా నియమిస్తారేమోనని అనుమానంగా ఉందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. శుక్రవారం విశాఖ కలెక్టరేట్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీడీపీ కేడర్లు చంద్రబాబుని నమ్మడం మానేసి.. నిమ్మగడ్డ రమేష్‌ను నమ్ముకున్నట్టున్నాయిని, హైదరాబాద్ నుంచి పనిచేస్తున్న టీడీపీ, ఎన్ఆర్ఐ పార్టీగా మిగిలిపోయిందన్నారు. ఎన్టీఆర్‌ను 150 అడుగుల గోతిలో బాబు పాతేస్తే.. పోలవరం కట్టి 150 అడుగుల ఎత్తున వైఎస్ఆర్ విగ్రహన్ని సీఎం జగన్ నిలబెడతారని తెలిపారు. […]

Update: 2020-11-20 08:47 GMT

దిశ, విశాఖపట్నం: రిటైర్మెంట్ తర్వాత నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంటుగా నియమిస్తారేమోనని అనుమానంగా ఉందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. శుక్రవారం విశాఖ కలెక్టరేట్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీడీపీ కేడర్లు చంద్రబాబుని నమ్మడం మానేసి.. నిమ్మగడ్డ రమేష్‌ను నమ్ముకున్నట్టున్నాయిని, హైదరాబాద్ నుంచి పనిచేస్తున్న టీడీపీ, ఎన్ఆర్ఐ పార్టీగా మిగిలిపోయిందన్నారు. ఎన్టీఆర్‌ను 150 అడుగుల గోతిలో బాబు పాతేస్తే.. పోలవరం కట్టి 150 అడుగుల ఎత్తున వైఎస్ఆర్ విగ్రహన్ని సీఎం జగన్ నిలబెడతారని తెలిపారు.

అంతేగాకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతోందంటే.. చంద్రబాబుకు భయంగా, బాధగా ఉందన్నారు. పేదల వ్యతిరేకి, అభివృద్ధి నిరోధకుడు చంద్రబాబు.. ప్రతిపక్ష నాయకుడుగా అనర్హుడున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. ఒక్క రూపాయికే పేదలకు 300 చదరపు అడుగుల ఇల్లు ఇస్తుంటే.. టీడీపీకి మిగిలిన 20 సీట్ల గుండె ధైర్యం కూడా పోయిందన్నారు. రాష్ట్ర చరిత్రలో పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వవొద్దని అడ్డుపడిన ఏకైక పార్టీగా టీడీపీ మిగిలిపోతుందన్నారు. దళిత వర్గాలకు, బీసీలకు, పేదలకు టీడీపీ చేసిన ద్రోహం మీద ఎక్కడికక్కడ పేదలు నిలదీయాలని ప్రజలకు సూచించారు.

Tags:    

Similar News