'ఆర్ఆర్ఆర్‌కు అనర్హత వర్తించదు'

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్సీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు అనర్హత వర్తించదని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. చట్టసభల బయట చేసిన వ్యాఖ్యలు, ప్రకటనలు అనర్హత చట్టంలోని సెక్షన్‌ 2 కిందకు రావని యనమల పేర్కొన్నారు. ‘ఒక ఎంపీ గానీ, ఎమ్మెల్యే గానీ ఎవరైనా చట్టసభల బయట మాట్లాడిన మాటలకు అనర్హత చట్టం వర్తించదు. ఈ చట్టం రెండు అంశాల్లో మాత్రమే వర్తిస్తుంది. ఒకటి…విప్‌ జారీచేస్తే దానికి అనుగుణంగా ఓటు వేయనప్పుడు.. రెండోది.. విప్‌కు కట్టుబడకుండా […]

Update: 2020-07-03 21:24 GMT

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్సీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు అనర్హత వర్తించదని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. చట్టసభల బయట చేసిన వ్యాఖ్యలు, ప్రకటనలు అనర్హత చట్టంలోని సెక్షన్‌ 2 కిందకు రావని యనమల పేర్కొన్నారు. ‘ఒక ఎంపీ గానీ, ఎమ్మెల్యే గానీ ఎవరైనా చట్టసభల బయట మాట్లాడిన మాటలకు అనర్హత చట్టం వర్తించదు. ఈ చట్టం రెండు అంశాల్లో మాత్రమే వర్తిస్తుంది. ఒకటి…విప్‌ జారీచేస్తే దానికి అనుగుణంగా ఓటు వేయనప్పుడు.. రెండోది.. విప్‌కు కట్టుబడకుండా సభనుంచి గైర్హాజరైనప్పుడు అనర్హత చట్టం కింద చర్యలు తీసుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విషయంలో ఈ రెండూ జరగలేదు. అందుకే ఆయనపై అనర్హత సెక్షన్‌ వర్తించదు’ అని పేర్కొన్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News