ఉక్రెయిన్లో వైమానిక ఇంధన డిపోను పేల్చివేసిన రష్యా
సెంట్రల్ ఉక్రెయిన్లో లక్ష టన్నుల మేరకు నిల్వఉంచిన విమాన ఇంధన డిపోను పేల్చి వేసినట్లు రష్యా పేర్కొంది. Latest Telugu News
న్యూఢిల్లీ: సెంట్రల్ ఉక్రెయిన్లో లక్ష టన్నుల మేరకు నిల్వఉంచిన విమాన ఇంధన డిపోను పేల్చి వేసినట్లు రష్యా పేర్కొంది. చెర్కసీ రీజియన్లోని స్మిలా గ్రామ సమీపంలో నిల్వ ఉంచిన వైమానిక ఇంధన డిపోను తాము పేల్చి వేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం పేర్కొంది. ఉక్రెయిన్ వాయుసేన అవసరాల కోలం ఇంత భారీ మొత్తంలో చమురును డిపోలో నిల్వ చేసి ఉంచారని తెలిపింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మానస పుత్రిక అయిన రోడ్డు వంతెనను ఉక్రెయిన్ బలగాలు పేల్చివేసినప్పటి నుంచి రష్యన్ బలగాలు ఉక్రెయిన్ భూభాగాలపై భారీ దాడులతో ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నాయి.