Russia-Ukraine Conflict: 10 వేల మంది రష్యా సైనికుల్ని మట్టుపెట్టాం: ఉక్రెయిన్ ఆర్మీ

Russia-Ukraine Conflict

Update: 2022-03-05 12:48 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వేలాది మంది ప్రాణాలు తీసుకుంటోంది. ఇటు పౌరులు, అటు సైనికులు బలి అవుతున్నారు. యుద్ధం మొదలై పది రోజులు పూర్తయిన క్రమంలో ఇప్పటి వరకు 10వేల మంది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయారని ఉక్రెయిన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ ప్రకటించింది. అంతేగాకుండా, రష్యాకు చెందిన 269 ట్యాంకులు, 945 సాయుధ పోరాట వాహనాలు, 105 ఆర్టిలరీ వ్యవస్థలు, 50 మల్టిపుల్‌ లాంచ్‌ రాకెట్‌ సిస్టమ్‌లు, 39 యుద్ధ విమానాలు, 40 హెలికాప్టర్లను ధ్వంసం చేశారు. ప్రపంచంలోనే శక్తివంతమైన దేశమైన రష్యాతో వెనకడుగు వేయకుండా చిన్న దేశమైన ఉక్రెయిన్ పోరాడుతున్న నేపథ్యంలో అక్కడి పౌరులు దేశానికి అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. వివిధ కారణాల చేత ఉక్రెయిన్ నుంచి వెళ్లి ఇతర దేశాలల్లో ఉన్న దాదాపు 66 వేల మంది పౌరులు తిరిగి వచ్చి ఆయుధాలు పట్టారని అక్కడి రక్షణ మంత్రి ఒలెక్సి రెజ్నికోవ్ మీడియాతో వెల్లడించారు.

Tags:    

Similar News