అమెరికా కోర్టు జడ్జిగా తెలుగు మహిళ.. మాతృభాషలో ప్రమాణ స్వీకారం.. వీడియో వైరల్

తెలుగు మహిళకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది.

Update: 2024-05-26 10:25 GMT

దిశ వెబ్ డెస్క్: తెలుగు మహిళకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన జయ బాడిగ కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్‌ కోర్టు జడ్జిగా నియమితులయ్యారు. కాగా ఆమె జడ్జిగా ప్రమాణ స్వీకారం చేస్తే తెలుగులో మాట్లాడారు. కాగా జయ బాడిగ ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జన్మించారు.

కాగా ఈమె హైదరాబాద్‌లోని ఉస్మానియా వర్సిటీలో 1991–94 మధ్య సైకాలజీ, పొలిటికల్‌ సైన్స్‌ సబ్జెక్టులతో బీఏ పూర్తి చేశారు. అనంతకం ఆమె ఉన్నతవిద్యాభ్యాసం అమెరికాలోని బోస్టన్‌ విశ్వవిద్యాలయంలో సాగింది. బోస్టన్‌ విశ్వవిద్యాలయం నుండి రిలేషన్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ కమ్యూనికేషన్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పట్టా పొందారు. ఆ తరువాత శాంటాక్లారా విశ్వవిద్యాలయం నుండి లా పట్టాను పొందారు.

చదువు పూర్తైన తరవాత ఆమె కాలిఫోర్నియాలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెల్త్‌ కేర్‌ సర్వీసెస్‌ అటార్నీగా, గవర్నర్‌ కార్యాలయం అత్యవసర సేవల విభాగంలో పనిచేశారు. ఇక జయ తండ్రి బాడిగ రామకృష్ణ, ఈయన 2004 నుండి 2009 వరకు మచిలీపట్నం ఎంపీగా పనిచేశారు.

Click Here For Twitter Post..

Similar News