బంగారంతో నీట మునిగిన నౌక..నిధి కోసం వేట..!!

టన్నుల కొద్ది బంగారంతో స్పానిష్‌కు బయలు దేరిన నౌక దాదాపు 300 ఏళ్ల క్రితం శత్రు దాడిలో దెబ్బతిని సముద్రంలో మునిగిపోయింది.

Update: 2024-05-24 15:21 GMT

దిశ,వెబ్‌డెస్క్:టన్నుల కొద్ది బంగారంతో స్పానిష్‌కు బయలు దేరిన నౌక దాదాపు 300 ఏళ్ల క్రితం శత్రు దాడిలో దెబ్బతిని సముద్రంలో మునిగిపోయింది. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన మరో న్యూస్ వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..అప్పటి నుంచి అత్యంత విలువైన ఆ నిధి సముద్ర గర్భంలోనే నిక్షిప్తమై ఉంది. కొన్నేళ్ల కిందట దానిని గుర్తించినా..వాటాల్లో తేడా వచ్చి ఎవరూ వెలికి తీయలేదని సమాచారం. తాజాగా దానిని దక్కించుకోవడానికి కొలంబియా దేశం వేగంగా పావులు కదుపుండటంతో వార్తల్లో నిలిచింది. కరేబియన్ సముద్రంలో మునిగిన శాన్‌జోస్ అనే పురాతన నౌకను తాము పరిశోధించడం మొదలు పెడతామని కొలంబియా ఇటీవల ప్రకటించింది. ఈ ప్రకటనలో అమెరికా, స్పెయిన్, పెరూ సహా పలు దేశాలు అప్రమత్తమయ్యాయి.

Similar News