గాజాలోని వెస్ట్ బ్యాంక్‌పై ఇజ్రాయెల్ దాడి: ఏడుగురు పాలస్తీయన్ల మృతి

గాజాపై దాడి చేయొద్దని ప్రపంచ దేశాలు సూచిస్తున్నా, నెతన్యాహుపై అరెస్టు వారెంట్ జారీ చేస్తామని అంతర్జాతీయ న్యాయస్థానంలో చర్చ జరిగినా ఇజ్రాయెల్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

Update: 2024-05-22 03:22 GMT

దిశ, నేషనల్ బ్యూరో: గాజాపై దాడి చేయొద్దని ప్రపంచ దేశాలు సూచిస్తున్నా, నెతన్యాహుపై అరెస్టు వారెంట్ జారీ చేస్తామని అంతర్జాతీయ న్యాయస్థానంలో చర్చ జరిగినా ఇజ్రాయెల్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. గాజాపై నిరంతరం విరుచుకుపడుతూనే ఉంది. తాజాగా ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని జెనిన్ నగరంలో ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడిలో ఒక వైద్యుడితో సహా ఏడుగురు మరణించినట్టు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే మరో తొమ్మిది మంది గాయపడ్డారని అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొంది. ఇజ్రాయెల్ క్షిపణులు ఉత్తర గాజా ఆస్పత్రిలోని అత్యవసర విభాగంపై పడటంతో..భయాందోళనకు గురైన వైద్య సిబ్బంది ఆస్పత్రిలోని పేషెంట్లను బయటకు తరలించారు.

ఈ దాడిని ఇజ్రాయెల్ కూడా ధ్రువీకరించింది. జెనిన్ నగరంలో సాయుధ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు వెల్లడించింది.ఈ దాడుల్లో అనేక మంది పాలస్తీనా ముష్కరులను కాల్చిచంపారని ఇజ్రాయెల్ మిలటరీ తెలిపింది. వెస్ట్ బ్యాంక్‌కు ఉత్తరాన ఉన్న జెనిన్ నగరం పాలస్తీనా మిలిటెంట్ గ్రూపులకు బలమైన కోటగా ఉందని ఇజ్రాయెల్ భావిస్తోంది. అందుకే క్రమం తప్పకుండా ఇక్కడ దాడులు చేస్తోంది. కాగా, 1967లో ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకున్న పాలస్తీనా భూభాగాలలో వెస్ట్ బ్యాంక్ ఒకటి. ఇక్కడ అక్టోబర్ 2023 నుంచి దాదాపు 500 మంది పాలస్తీనియన్లు చంపబడినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

గాజా స్ట్రిప్‌లో స్థావరాలను తిరిగి ఏర్పాటు చేయడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. ఓ మీడియా చానల్‌తో ఆయన మాట్లాడుతూ..గాజా యుద్ధానంతర నిర్వహణ కోసం తన ప్రణాళిక గురించి నొక్కిచెప్పిన నెతన్యాహు..రఫాలో మిగిలిన బెటాలియన్లతో సహా హమాస్‌ను ఓడించడమే తన ప్రాధాన్యత అని చెప్పారు. విజయం సాధించే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మరోవైపు గాజాకు తగినంత సహాయం అందించడానికి రోజుకు సుమారు 500 ట్రక్కులు అవసరమని ఐక్యారాజ్యసమితి తెలిపింది. 

Tags:    

Similar News