స్వాధీనం చేసుకున్న షిప్‌లో 5 మంది భారతీయులను విడుదల చేసిన ఇరాన్

ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో కొద్ది కాలం క్రితం ఇరాన్ ఒక షిప్‌ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

Update: 2024-05-10 03:41 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో కొద్ది కాలం క్రితం ఇరాన్ ఒక షిప్‌ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. దానిలో 17 మంది భారతీయులు ఉండగా, వారందరిని ఇరాన్ తమ అధీనంలోకి తీసుకుంది. దీంతో వారిని విడిచిపెట్టాలని భారత ప్రభుత్వం ఇరాన్‌ను కోరగా, తాజాగా 5 మంది భారతీయులను విడిచిపెట్టినట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. దానిలో మొత్తం 25 మంది ఉండగా వారిలో 17 మంది భారత్‌కు చెందిన వారు. కొద్ది రోజుల క్రితం కేరళలోని త్రిసూర్‌కు చెందిన ఆన్ టెస్సా జోసెఫ్ అనే మహిళ విడిచిపెట్టిన వారు ఇప్పుడు మరో 5 మందిని విడుదల చేసినట్లు ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం ప్రకటించింది. మిగిలిన 11 మంది మాత్రం ఇంకా అక్కడే ఉన్నారు. వారిని కూడా త్వరలో విడిచిపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

వారి కుటుంబ సభ్యులతో భారత అధికారులు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రస్తుతం వారంతా క్షేమంగా ఉన్నారని వారిని కూడా త్వరలో సురక్షితంగా భారత్‌‌కు తీసుకువస్తామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వరుస ప్రతీకార దాడుల మధ్య ఏప్రిల్ 13న హార్ముజ్ జలసంధి సమీపంలో కార్గో నౌక MSC ఏరీస్‌ను ఇరాన్ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్ స్వాధీనం చేసుకుంది. దీనిలో మొత్తం 25 మంది సిబ్బంది ఉండగా, వారిలో 17 మంది భారతీయులే. దీంతో వారి భద్రతపై ఆందోళన నెలకొనగా, భారత రాయబార అధికారులు ఇరాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతూ వారిని సురక్షితంగా భారత్‌కు రప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News