అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. న్యూయార్క్‌లోని ‘స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్‌’లో చదువుతున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బేలెం అచ్యుత్ బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు

Update: 2024-05-24 03:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో : అమెరికాలో మరో తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. న్యూయార్క్‌లోని ‘స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్‌’లో చదువుతున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బేలెం అచ్యుత్ బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అతడు బైక్‌పై వెళ్తుండగా మరో వాహనం వచ్చి ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అచ్యుత్ మృతి పట్ల అమెరికాలోని భారత కాన్సులేట్ జనరల్ ఎక్స్ వేదికగా ప్రగాఢ సంతాపాన్ని వెలిబుచ్చారు. న్యూయార్క్‌లోని స్థానిక అధికారులతో సంప్రదించి.. అచ్యుత్ మృతదేహాన్ని భారతదేశానికి సాధ్యమైనంత త్వరగా పంపే ప్రయత్నాల్లో ఉన్నట్లు వెల్లడించారు. తమ తరఫున అన్ని రకాల సహాయ సహకారాలను అందించడానికి అచ్యుత్ కుటుంబ సభ్యులతోనూ టచ్‌లో ఉన్నామని భారత కాన్సులేట్ జనరల్ చెప్పారు.

Similar News