భారత్ మాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోరుకుంటుంది: మాల్దీవుల మంత్రి సయీద్

ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని రూపొందించేందుకు భారత్ ప్రయత్నాలు ప్రారంభించిందని మాల్దీవుల ఆర్థిక, వాణిజ్య మంత్రి మహ్మద్ సయీద్ తెలిపారు. దానిని సాధించేందుకు చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

Update: 2024-05-26 09:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని రూపొందించేందుకు భారత్ ప్రయత్నాలు ప్రారంభించిందని మాల్దీవుల ఆర్థిక, వాణిజ్య మంత్రి మహ్మద్ సయీద్ తెలిపారు. దానిని సాధించేందుకు చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. తాజాగా ఆయన మాలేలో మీడియాతో మాట్లాడారు. మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు అన్ని దేశాలకు ఈ అవకాశాన్ని అందించారని, వాణిజ్య కార్యకలాపాలలో సులభతరం చేయడానికి వీలైనంత ఎక్కువ దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. తద్వారా వాణిజ్య కార్యకలాపాలు సులభతరం అవుతాయని ఆశిస్తు్న్నట్టు వెల్లడించారు.

కాగా, చైనా అనుకూల నాయకుడిగా పేరు పొందిన ముయిజ్జు మాల్దీవుల అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. మాల్దీవుల్లో ఉన్న భారత సిబ్బందిని సైతం వెనక్కి తీసుకోవాలని ఆదేశించడంతో బలగాలను ఉపసంహరించుకున్నారు. ఈ నేపథ్యంలోనే సయీద్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరోవైపు దక్షిణాసియా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (సాఫ్టా) ఇప్పటికే భారత్, మాల్దీవుల మధ్య అమలులో ఉంది. మాల్దీవులలోని భారత హైకమిషన్ రికార్డుల ప్రకారం.. గతేడాది భారతదేశం మాల్దీవులకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది.

Tags:    

Similar News