ఏ తండ్రికీ రాకూడని కష్టం.. కూతురు కోసం ఆ పని చేయలేక అవమానంతో కాళ్లు పట్టుకున్న వ్యక్తి

తల్లిదండ్రులు తమని పెంచేందుకు ఎంత కష్ట పడుతున్నారో నేటి యువతలో చాలా మందికి అనవసరం.

Update: 2024-05-24 09:05 GMT

దిశ వెబ్ డెస్క్: తల్లిదండ్రులు తమని పెంచేందుకు ఎంత కష్ట పడుతున్నారో నేటి యువతలో చాలా మందికి అనవసరం. వాళ్ల గొంతెమ్మ కోరికలు తరుస్తున్నారా లేదా అనేదే వాళ్లకు ముఖ్యం. తల్లిదండ్రులు ఆర్ధిక పరిస్థితిని అర్థం చేసుకోకుండా తాము పట్టిన కుందేళుకు మూడే కాళ్లు అంటున్నారు. చదువు చెప్పి్చడమే కష్టంగా ఉన్నా, తమలా తమ పిల్లలు కష్టంపడకూడదని స్థోమతకు మించి చదివిస్తున్న తల్లిదండ్రుల ఎందరో ఉన్నారు.

అయితే ముందు ముక్కిడిగా ఉంటే పైన దగ్గు, పడిశం అన్నట్టు చదువులకు పెట్టేందుకే కష్టపడుతున్న తల్లిదండ్రులు కష్టాన్ని గుర్తించకుండా తల్లిదండ్రులు మనసు నొప్పిస్తున్నారు కొందరు పిల్లలు. ఐఫోన్ కావాలని అడిగిన కూతురు కోరిక తీర్చలేని తాను ఉన్నందుకు అవమానంతో కన్న కూతురు ముందు మోకరిల్లి ఓ తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు.

ఆ ఘటన చైనాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చైనాకు చెందిన తండ్రీకూతురు రోడ్డుపైన వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో తనకు ఐ ఫోన్ కొనివ్వమని ఆ కూతురు తన తండ్రిని అడిగింది. అయితే ఐ ఫోన్ తీసిచ్చేటంత స్థోమత తనకు లేదని, తన దగ్గర డబ్బులు లేవని ఆ తండ్రి తన కూతురుకి నచ్చ చేప్పేందుకు ప్రయత్నించారు. కానీ ఆ కూతురు వినలేదు, నడిరోడ్డుపై ఉన్నామన్న ఇంకితం లేకుండా తన తండ్రిని దూషించింది.

నీ దగ్గర డబ్బులు ఎందుకు లేవు..? డబ్బులు లేకపోవడానికి ఎవరు కారణం..? అంటూ గట్టిగా అరవడం మొదలు పెట్టింది. దీనితో తన కూతురు కోరిక తీర్చలేని తన నిస్సహాయతకు సిగ్గుపడిన ఆ తండ్రి కూతురు ముందు మోకరిల్లి తన ఆర్థిక అసమర్థతకు తానే కారణమని చెప్పుకుంటూ అవమానంతో కన్నీటిపర్యంతమయ్యారు. కాగా అక్కడే ఉన్న మరో వ్యక్తి ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా అదికాస్త వైరల్‌గా మారింది. 

Similar News