BREAKING: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థి దుర్మరణం

అమెరికాలోని న్యూయార్క్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

Update: 2024-05-24 01:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలోని న్యూయార్క్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉన్నత చదువుల కోసం ఏపీకి చెందిన బీలం అచ్యుత్ బుధవారం సాయంత్రం జరిగిన బైక్ ప్రమాదంలో స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం అతడు న్యూయార్క్‌ స్టేట్‌ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. ‘అచ్యుత్‌ బైక్‌ యాక్సిడెంట్ లో బుధవారం మధ్యాహ్నం మరణించాడు. అతడి అకాల మరణంపై చాలా బాధించింది. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. అచ్యుత్ ఫ్యామిలీ, స్థానిక ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నాం. మృతదేహాన్ని ఇండియాకు పంపించేందుకు అన్ని రకాలుగా సహకారం అందిస్తాం’ అంటూ కాన్సులేట్‌ జనరల్‌ తన X (ట్విట్టర్)ఖాతా‌లో పోస్ట్ చేశారు. 

Tags:    

Similar News