అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..8 మందిని దారుణంగా కాల్చి చంపిన దుండగుడు (వీడియో)

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించింది. యుఎస్ లోని టెక్సాస్‌లో రద్దీగా ఉండే ఓ మాల్‌లో గన్‌మెన్‌గా పనిచేసే వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు.

Update: 2023-05-07 04:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించింది. యుఎస్ లోని టెక్సాస్‌లో రద్దీగా ఉండే ఓ మాల్‌లో గన్‌మెన్‌గా పనిచేసే వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో దాదాపు 8 మంది అక్కడిక్కడే మృతి చెందారు. అలాగే మరో ఏడుగురు ఈ కాల్పుల్లో గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. అలాగే కాల్పులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు కాల్చి చంపారు. కాగా దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డు అయ్యాయి.

Tags:    

Similar News