Qatar Airways: ఆకాశంలో కుదపునకు గురైన మరో విమానం.. 12 మంది ప్రయాణికులకు గాయాలు

ఇటీవలే లండన్‌ నుంచి సింగపూర్ వెళ్తున్న సింగపూర్‌ ఎయిర్‌‌లైన్స్‌ ఫ్లైట్ ఆకాశంలో కుదుపునకు గురైంది.

Update: 2024-05-27 04:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవలే లండన్‌ నుంచి సింగపూర్ వెళ్తున్న సింగపూర్‌ ఎయిర్‌‌లైన్స్‌ ఫ్లైట్ ఆకాశంలో కుదుపునకు గురైంది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే, ఆ ఘటనను మరువకు ముందే మరో విమానం గగనతలంలో తీవ్ర కుదుపునకు గురైంది. దోహా నుంచి ఐర్లాండ్‌‌లోని డబ్లిన్‌‌కు వెళ్తున్న ఖతార్‌ ఎయిర్‌‌‌లైన్స్ విమానం మార్గమధ్యలో టర్కీ దేశ గగనతలంలో తీవ్ర కుదుపులకు గురైంది. ఈ ప్రమాదంలో విమానంలోని 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అందులో ఆరుగురు ఫ్లైట్ క్రూ కూడా ఉన్నారు. ఘటన జరిగిన కొద్దిసేపటికే పరిస్థితి అదుపులోకి రావడంతో ప్రయాణం సాఫీగా సాగి డబ్లిన్‌లో ఫ్లైట్ సేఫ్‌గా ల్యాండ్ అయింది.

Tags:    

Similar News