UKలో స్మగ్లింగ్ కేసులో 12 మంది భారత సంతతి వ్యక్తులు అరెస్ట్

అంతర్జాతీయ మనీలాండరింగ్, మానవ స్మగ్లింగ్‌లో ప్రమేయం ఉన్న వెస్ట్ లండన్‌కు చెందిన ఒక వ్యవస్థీకృత క్రైమ్ గ్రూప్‌పై పెద్ద దర్యాప్తు చేపట్టారు.

Update: 2023-05-11 06:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ మనీలాండరింగ్, మానవ స్మగ్లింగ్‌లో ప్రమేయం ఉన్న వెస్ట్ లండన్‌కు చెందిన ఒక వ్యవస్థీకృత క్రైమ్ గ్రూప్‌పై పెద్ద దర్యాప్తు చేపట్టారు. దీంట్లో భారత సంతతికి చెందిన 12 మంది భారతీయ సంతతి వ్యక్తులను UK పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఒక మహిళ కూడా ఉందని.. మొత్తం 16 మందని దోషులుగా నిర్ధారించినట్లు UK యొక్క నేషనల్ క్రైమ్ ఏజెన్సీ (NCA) తెలిపింది. దీని ప్రకారం.. నెట్‌వర్క్ సభ్యులు 2017- 2019 మధ్యకాలంలో దుబాయ్, UAE లకు వందల సార్లు రవాణా చేసి UK నుండి GBP 42 మిలియన్ల కంటే ఎక్కువ నగదును అక్రమంగా రవాణా చేశారు. కాగా ఈ డబ్బు క్లాస్ A డ్రగ్స్, ఆర్గనైజ్డ్ ఇమ్మిగ్రేషన్ క్రైమ్‌ల విక్రయాల నుండి వచ్చిన లాభంగా NCA పరిశోధనలో తేలింది.

Also Read:

ఎయిర్‌పోర్ట్‌లో క్యూలో నిల్చున్న కేటీఆర్.. నెటిజన్ల ఫిదా 

Tags:    

Similar News