ఇండోనేషియాలో భారీ వర్షాలు.. 11 మంది మృతి, 50 మందికి పైగా గల్లంతు

ఇండోనేషియాలో భారీ వర్షాలు అల్లకల్లోలం సృష్టించాయి. సోమవారం సరిహద్దుల్లోని దీవులను కుండపోత వర్షాలు ముంచెత్తాయి

Update: 2023-03-06 17:16 GMT

జకర్తా: ఇండోనేషియాలో భారీ వర్షాలు అల్లకల్లోలం సృష్టించాయి. సోమవారం సరిహద్దుల్లోని దీవులను కుండపోత వర్షాలు ముంచెత్తాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడిన ఘటనలో 11 మంది మరణించారు. పదుల సంఖ్యలో గల్లంతైనట్లు స్థానిక విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. కనిపించకుండా పోయిన వారి సంఖ్య 50కి పైనే ఉంటుందని అధికారులు తెలిపారు. కుండ‌పోత వర్షాలకు పెద్ద ఎత్తున పలు ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిన్నట్లు చెప్పారు. అంతేకాకుండా పలు ప్రాంతాల్లో రోడ్లు దారుణంగా ధ్వంసమైనట్లు తెలిపారు. ఇండోనేషియాలోని బోర్నియోలోని బంజార్ జిల్లాలో దక్షిణాన వరదలు 17,000 కంటే ఎక్కువ ఇళ్ళను ముంచెత్తాయి. గతవారం మలేషియాను కూడా భారీ వరదలు ముంచెత్తాయి. సుమారు 41 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.



Tags:    

Similar News