మహిళను బెదిరించి నగలు ఎత్తుకెళ్లి..

దిశ, మెదక్: రామాయంపేట మండలం కోనాపూర్‌లో దారుణం జరిగింది. ఓ మహిళను బెదిరించి ఆమె మెడలోని బంగారు నగలను ఎత్తుకెళ్లాడు ఓ దుండగుడు. ఈ ఘటన ఆదివారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన పాపన్నగారి పుష్ప తన ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. శనివారం రాత్రి గుర్తు తెలియన వ్యక్తి ఇంట్లోకి చొరబడి ఆమెను బెదిరించాడు. ఆమె మెడలో ఉన్న మూడు తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. దీంతో ఆమె ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు […]

Update: 2020-04-26 23:30 GMT

దిశ, మెదక్: రామాయంపేట మండలం కోనాపూర్‌లో దారుణం జరిగింది. ఓ మహిళను బెదిరించి ఆమె మెడలోని బంగారు నగలను ఎత్తుకెళ్లాడు ఓ దుండగుడు. ఈ ఘటన ఆదివారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన పాపన్నగారి పుష్ప తన ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. శనివారం రాత్రి గుర్తు తెలియన వ్యక్తి ఇంట్లోకి చొరబడి ఆమెను బెదిరించాడు. ఆమె మెడలో ఉన్న మూడు తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. దీంతో ఆమె ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్, రామాయంపేట సీఐ నాగార్జునగౌడ్ ఘటన స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు.

Tags: gold ornaments, theft, woman, medak, crime news

Tags:    

Similar News