ఆపకపోతే.. ఆత్మహత్య చేసుకుంటా

దిశ, నల్లగొండ: తన ఇంటి ముందు హై టెన్షన్‌ విద్యుత్‌ తీగలు ఏర్పాటు చేయోద్దంటూ ఓ మహిళ పెట్రోల్ బాటిల్‌తో హల్‌చల్‌ చేసింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో చోటుచేసుకుంది. తన ఇంటి సమీపంలో విద్యుత్ టవర్ల నిర్మాణం ఆపకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. చౌటుప్పల్‌లో విద్యుత్‌ సబ్ స్టేషన్‌కు అదనపు విద్యుత్‌ జంక్షన్ కోసం రామన్నపేట నుంచి టవర్ల ద్వారా విద్యుత్‌ లైన్‌ ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. చౌటుప్పల్‌లో టవర్‌ ఏర్పాటు కోసం […]

Update: 2020-06-13 05:02 GMT

దిశ, నల్లగొండ: తన ఇంటి ముందు హై టెన్షన్‌ విద్యుత్‌ తీగలు ఏర్పాటు చేయోద్దంటూ ఓ మహిళ పెట్రోల్ బాటిల్‌తో హల్‌చల్‌ చేసింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో చోటుచేసుకుంది. తన ఇంటి సమీపంలో విద్యుత్ టవర్ల నిర్మాణం ఆపకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. చౌటుప్పల్‌లో విద్యుత్‌ సబ్ స్టేషన్‌కు అదనపు విద్యుత్‌ జంక్షన్ కోసం రామన్నపేట నుంచి టవర్ల ద్వారా విద్యుత్‌ లైన్‌ ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. చౌటుప్పల్‌లో టవర్‌ ఏర్పాటు కోసం పునాది తవ్వి నిర్మాణం మొదలు పెట్టారు. అయితే అక్కడ టవర్‌ నిర్మాణం చేపడితే తన ఇంటికి నష్టం జరుగుతుందని.. ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణ పనులు ఆపకపోతే పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ హెచ్చరించింది.

Tags:    

Similar News