ఆ కోరిక తీర్చాలని కోరిన భర్త.. సోదరులతో కలిసి హతమార్చిన భార్య

దిశ, కామారెడ్డి:  భర్తతో కలిసి జీవితాన్ని పంచుకోవాల్సిన భార్య.. అతడి పాలిట యమపాశంగా మారింది. కష్టసుఖాల్లో తోడుగా ఉండాల్సిన ఆమె అతని చావుకు కారణమైంది. బావమరుదులు భూమి విక్రయించగా వచ్చిన డబ్బులలో తన అవసరానికి కొంత తేవాలని భార్యకు సూచించడమే ఆయన చేసిన పాపమైంది. ఎక్కడ డబ్బులు ఇవ్వాల్సివస్తుందోనని తన అన్నదమ్ములతో కలిసి భర్తను అతిదారుణంగా హత్యచేసింది ఓ భార్య.. ఈ దారుణ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. […]

Update: 2021-06-07 03:12 GMT

దిశ, కామారెడ్డి: భర్తతో కలిసి జీవితాన్ని పంచుకోవాల్సిన భార్య.. అతడి పాలిట యమపాశంగా మారింది. కష్టసుఖాల్లో తోడుగా ఉండాల్సిన ఆమె అతని చావుకు కారణమైంది. బావమరుదులు భూమి విక్రయించగా వచ్చిన డబ్బులలో తన అవసరానికి కొంత తేవాలని భార్యకు సూచించడమే ఆయన చేసిన పాపమైంది. ఎక్కడ డబ్బులు ఇవ్వాల్సివస్తుందోనని తన అన్నదమ్ములతో కలిసి భర్తను అతిదారుణంగా హత్యచేసింది ఓ భార్య.. ఈ దారుణ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. కామారెడ్డి పట్టణంలోని బీడీ వర్కర్స్ కాలనిలో ప్రవీణ్ (38), లావణ్య దంపతులు నివాసం అంటున్నారు. వీరికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. మెట్ పల్లి శివారులో బీడీ కార్ఖానాలకు ఇంఛార్జిగా ప్రవీణ్ పని చేస్తున్నాడు.

శనివారం విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన ప్రవీణ్ చిన్నమల్లారెడ్డి గ్రామంలో తన బామ్మర్దులు భూమి విక్రయించగా వచ్చిన డబ్బులలో కొంత అడగమని భార్య లావణ్యకు సూచించాడు. ఇదే విషయం ఆమె అన్నదమ్ములైన రమేష్, శ్రీను, లక్ష్మణ్ ల వద్ద ప్రస్తావించింది. భర్తకు డబ్బులు ఇవ్వడం ఇష్టంలేని భార్య తన అన్నదమ్ములతో కలిసి భర్తను హత్యచేయడానికి ప్లాన్ వేసింది. సోమవారం ఉదయం కామారెడ్డికి ముగ్గురు బామ్మర్దులు, వారి భార్యలు, ప్రవీణ్ భార్య కలిసి ప్రవీణ్ పై ఇటుకలు, కర్రలతో దారుణంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్ర గాయాలైన ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న దేవునిపల్లి రూరల్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సై రవికుమార్ కాలానికి వచ్చి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాలనిలో అందరితో కలుపుగోలుగా ఉండే ప్రవీణ్ హత్యకు గురికావడం కాలనిలో విషాదాన్ని నింపింది.

Tags:    

Similar News