అసెంబ్లీలో తుంగతుర్తి ఎమ్మెల్యే మాట్లాడింది ఇదే..

దిశ,తుంగతుర్తి : దళిత బంధు ఒక విప్లవాత్మకమైన పథకమని తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం శాసనసభలో దళిత బంధు పథకంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగానే దళిత బంధు పథకానికి అంకురార్పణ జరిగిందని తెలిపారు. దళిత బంధు పథకం ద్వారా ప్రయోజనం పొందే లబ్ధిదారులు ఎవరికి వారే ఉపాధి అవకాశాలను ఎంచుకునే వెసులుబాటు కల్పించారని పేర్కొన్నారు. హుజురాబాద్‌తో పాటు తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం కూడా […]

Update: 2021-10-05 06:37 GMT

దిశ,తుంగతుర్తి : దళిత బంధు ఒక విప్లవాత్మకమైన పథకమని తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం శాసనసభలో దళిత బంధు పథకంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగానే దళిత బంధు పథకానికి అంకురార్పణ జరిగిందని తెలిపారు. దళిత బంధు పథకం ద్వారా ప్రయోజనం పొందే లబ్ధిదారులు ఎవరికి వారే ఉపాధి అవకాశాలను ఎంచుకునే వెసులుబాటు కల్పించారని పేర్కొన్నారు. హుజురాబాద్‌తో పాటు తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం కూడా ఈ పథకంలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక అయిందన్నారు.

దళితుల సంక్షేమం కోసం ఇంతగా ఆరాటపడే ముఖ్యమంత్రి లేరని గాదరి కొనియాడారు. ఈ పథకం ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు నిదర్శనంగా నిలిచిందని అన్నారు. ముఖ్యంగా అంబేద్కర్ స్ఫూర్తితో తెలంగాణలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని తెలిపారు. ఇందులో భాగంగానే గురుకులాల ఏర్పాటు అని వివరించారు. అన్ని వర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పాటు పడుతున్నాడని, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌తో పాటు పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. గత పాలకులు దళితులను ఓటు బ్యాంకు గానే పరిగణించారని మండిపడ్డారు.

Tags:    

Similar News