డిమాండ్లు నెరవేర్చిన వారికే ఓట్లు !

దిశ, తెలంగాణ బ్యూరో: రాజకీయ పార్టీలకు ట్యాక్సీ డ్రైవర్ జేఏసీ బహిరంగ లేఖ రాసింది. ఈ ఏడాది మొత్తానికి మారిటోరియాన్ని వర్తింపజేసి వడ్డీలను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఈ విషయంలో తమకు మద్దతుగా నిలిచిన వారికే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్లు వేస్తామని స్పష్టం చేసింది. ఓలా, ఉబెర్, ఇతర ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న 1.50లక్షల మంది డ్రైవర్లు కరోనాతో ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నందున, కనీసం ఆరు నెలలు ఫిట్‌నెస్, రోడ్‌ట్యాక్స్‌లను మినహాయించాలని, ప్రతీ ట్యాక్సీకి మీటర్లు […]

Update: 2020-11-22 09:19 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాజకీయ పార్టీలకు ట్యాక్సీ డ్రైవర్ జేఏసీ బహిరంగ లేఖ రాసింది. ఈ ఏడాది మొత్తానికి మారిటోరియాన్ని వర్తింపజేసి వడ్డీలను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఈ విషయంలో తమకు మద్దతుగా నిలిచిన వారికే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్లు వేస్తామని స్పష్టం చేసింది. ఓలా, ఉబెర్, ఇతర ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న 1.50లక్షల మంది డ్రైవర్లు కరోనాతో ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నందున, కనీసం ఆరు నెలలు ఫిట్‌నెస్, రోడ్‌ట్యాక్స్‌లను మినహాయించాలని, ప్రతీ ట్యాక్సీకి మీటర్లు ప్రభుత్వమే బిగించాలని జేఏసీ ఛైర్మన్ షేక్ సలావుద్దీన్ కోరారు. ట్యాక్సీ డ్రైవర్ల కుటుంబాల్లో సుమారు 5.10 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, వారందరి జీవితాలను రక్షించేందుకు ఏ రాజకీయ పార్టీ ముందుకొస్తుందో వారికే తమ మద్దతు ఉంటుందని తెలిపారు.

Tags:    

Similar News