ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తాం: సీఎం కేసీఆర్

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికల సందర్భంలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగ‌త్‌కు ఆశీర్వచనమిచ్చి, భారీ మెజారిటీతో గెలిపించినందుకు నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానం ప్రకారం హామీలను నెరవేస్తామని వెల్లడించారు. త్వరలోనే ఎమ్మెల్యే భగత్ తోపాటు నాగార్జున సాగర్ నియోజక వర్గాన్ని సందర్శించి ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, […]

Update: 2021-05-02 11:43 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికల సందర్భంలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగ‌త్‌కు ఆశీర్వచనమిచ్చి, భారీ మెజారిటీతో గెలిపించినందుకు నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానం ప్రకారం హామీలను నెరవేస్తామని వెల్లడించారు. త్వరలోనే ఎమ్మెల్యే భగత్ తోపాటు నాగార్జున సాగర్ నియోజక వర్గాన్ని సందర్శించి ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.

దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధుల్లో ఇటీవల మంజూరు చేసిన లిఫ్టు ఇరిగేషన్ స్కీంలను శరవేగంగా పూర్తిచేసి ప్రజలకు నీరందిస్తామని సీఎం తెలిపారు. ఎన్నికల సందర్భంలో పార్టీ నాయకుల దృష్టికి వ‌చ్చిన‌ ప్రజా సమస్యన్నింటిని సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎవరు ఎన్నిరకాల దుష్ప్రచారం చేసినా.. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై తమ విశ్వాసాన్ని ప్రస్పుటంగా ప్రకటించిన ప్రజలకు సీఎం హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

రెట్టించిన ఉత్సాహంతో మున్ముందు ప్రజాసేవకు టీఆర్ఎస్ పార్టీ మరింతగా పునరంకితమౌతుందని తెలిపారు. విజయం సాధించిన అభ్యర్ధి నోముల భగత్ కు సీఎం కేసీఆర్ హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. ప్రజాసేవ చేసి మంచి రాజకీయ భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని భగత్ కు సూచించారు. నోముల భగత్ విజయం కోసం కృషి చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సీఎం అభినందనలు తెలిపారు.

Tags:    

Similar News