సాగ‌ర్‌ జలాశయంలో ‘నీటి ‌కు‌క్కల’ సందడి

దిశ, నాగార్జున‌ సాగ‌ర్‌ : ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జున‌ సాగ‌ర్‌ జలాశయంలో అరుదుగా కనిపించే నీటి‌ కు‌క్కలు సందడి చేశాయి. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సాగర్‌ జలాశయం నీటి మట్టం అంతకంతకూ పెరుగుతున్నది. దీంతో నీటి కుక్కలు రిజర్వాయర్‌‌లోని లాంచీ స్టేషన్‌ సమీపంలో దర్శనమిచ్చాయి. అరుదుగా కనిపించే ఈ జంతువులు నీటిలో ఉండే చేపలను ఆహారంగా తీసుకుంటాయని సమాచారం. ప్రస్తుతం నీటికుక్కల జాతి చాలా వరకు కనుమరుగైందని, కొన్ని మాత్రమే అక్కడక్కడ సంచరిస్తున్నట్లు […]

Update: 2021-07-21 04:51 GMT

దిశ, నాగార్జున‌ సాగ‌ర్‌ : ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జున‌ సాగ‌ర్‌ జలాశయంలో అరుదుగా కనిపించే నీటి‌ కు‌క్కలు సందడి చేశాయి. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సాగర్‌ జలాశయం నీటి మట్టం అంతకంతకూ పెరుగుతున్నది. దీంతో నీటి కుక్కలు రిజర్వాయర్‌‌లోని లాంచీ స్టేషన్‌ సమీపంలో దర్శనమిచ్చాయి. అరుదుగా కనిపించే ఈ జంతువులు నీటిలో ఉండే చేపలను ఆహారంగా తీసుకుంటాయని సమాచారం. ప్రస్తుతం నీటికుక్కల జాతి చాలా వరకు కనుమరుగైందని, కొన్ని మాత్రమే అక్కడక్కడ సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News