వార్నర్.. వెయిటింగ్ ఫర్ ఐపీఎల్ ?

కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ సీజన్ 13 షెడ్యూల్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఒకవేళ బీసీసీఐ ఐపీఎల్‌ను నిర్వహించదలిస్తే.. ఆస్ట్రేలియన్ క్రికెటర్, సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తప్పకుండా ఆడతాడని అతని మేనేజర్ జేమ్స్ ఎరిక్సన్ స్పష్టం చేశాడు. కాగా, తమ దేశ పౌరులెవరూ దేశం దాటి వెళ్లొద్దని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఐపీఎల్ ఆడతారా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ విషయంపై స్పందించిన వార్నర్ […]

Update: 2020-03-20 07:29 GMT

కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ సీజన్ 13 షెడ్యూల్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఒకవేళ బీసీసీఐ ఐపీఎల్‌ను నిర్వహించదలిస్తే.. ఆస్ట్రేలియన్ క్రికెటర్, సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తప్పకుండా ఆడతాడని అతని మేనేజర్ జేమ్స్ ఎరిక్సన్ స్పష్టం చేశాడు. కాగా, తమ దేశ పౌరులెవరూ దేశం దాటి వెళ్లొద్దని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఐపీఎల్ ఆడతారా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ విషయంపై స్పందించిన వార్నర్ మేనేజర్ జేమ్స్.. ఒకవేళ ఐపీఎల్ నిర్వహణ సాధ్యమైతే, వార్నర్ తప్పకుండా ఆడతాడని చెప్పాడు. వార్నర్‌ ఇప్పటికే ఐపీఎల్ కోసం మానసికంగా సిద్ధమైపోయాడని.. అయితే, ఆ మెగా లీగ్ జరుగుతుందా లేదా అనే దానిపైనే అనుమానాలున్నాయని జేమ్స్ స్పష్టం చేశాడు. కాగా, మిగతా ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ గురించి తాను చెప్పలేనని జేమ్స్ తెలిపాడు.

Tags : IPL, BCCI, David Warner, Australia Cricketers, Sunrisers

 

Tags:    

Similar News